చాలా రోజులకి మళ్ళీ బ్లాగ్ లోకం లోకి వచ్చేశాను. ఏంటో కాని జాబ్ రాలేదు అని చాలా టెన్షన్ పడుతూ, పిచ్చి పిచ్చి గా ఉన్నప్పుడు, rockwell collins Inc. అనే ఒక కంపెనీ మా కాలేజి కి వచ్చింది. ఎక్జాం పెట్టారు. రాసాను. కాని షార్ట్ లిస్టెడ్ లో నేను లేను. ఇంక ఛి ఎందుకు అనిపించింది. 9 మందిని సెలెక్ట్ చేసుకుంది కంపెనీ. అందుకే బాధ అనమాట.
కాని ఎందుకో కాని, మళ్ళీ ఒక వారం రోజులకి, అదే కంపెనీ ఆరోజు షార్ట్ లిస్ట్ అవ్వని స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూస్ అని చెప్పింది. ఇదే ఇంక లాస్ట్ చాన్స్ అని, వదులుకోకూడదు అని, రాత్రి అంతా బాగా ప్రిపేర్ అయ్యాను. పొద్దున్నే ఇంటర్వ్యూ. చాలా కసి గా ప్రిపేర్ అయ్యాను కదా, టెక్నికల్ రౌండ్ లో చాలా ఈజీ గా ప్రశ్నలు అడిగేసరికి, యెస్, నాకు ఉద్యోగం గ్యారంటీ అని ఫిక్స్ అయ్యాను. ఇంక రౌండ్ కూడ కుమ్మేశాను. కాని మళ్ళీ టెన్షన్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఫలితాలు రాత్రి విడుదల అని చెప్పారు. కాని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వస్తుంది అని. కాబట్టి, ఇంటికి ఫోన్ చేసి చెప్పేశాను. ఈరోజు ఉద్యోగం ఖాయం అని.
దేవుడు కరునించాడు. నిజంగానే ఆరోజు రాత్రి 8 మందిలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ ముగ్గురిలో నేను ఒకడిని అని. స్నేహితుడు చెప్పాడు. నిజంగా ఆరోజు ఎంత సంతోషం వేసిందో తెలుసా .. అన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితం, నిజంగా దేవుడు ఉన్నాడు. అందుకే.
ఇప్పుడు ఉద్యోగం లో నే ఉన్నాను. ఒకటే చెప్తాను. నమ్మకం చాలా అవసరం. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దాని కోసం వేచి ఉండాలి అంతే కాని సహనం కోల్పోకూడదు. నిరాశ చెందకూడదు. నిజంగా ఆ ఫలితం వచ్చిన రోజు మన ఆనందం చెప్పలేనిది. మరువలేనిది. ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
ఉద్యోగం బాగుంది. సహ ఉద్యోగులు బాగున్నారు. అమ్మా, నాన్నలకి ఇక నేను చేయాల్సిన సహాయం ఎంతో ఉంది. తమ్ముణ్ణి బాగా చదివించాలి. తమ్ముడికి కూడా 10 వ తరగతి లో 564 మార్కులు వచ్చాయి. ఇంకా సంతోషం. మరి ప్రస్తుతానికి సెలవు.