Thursday, August 2, 2012

ఎంత నేర్చిన ఎంత జూచిన ఎంత వారలైన కాంత దాసులే !

ప. ఎంత నేర్చిన ఎంత జూచిన
ఎంత వారలైన కాంత దాసులే

అ. సంతతంబు శ్రీ కాంత స్వాంత
సిద్ధాంతమైన మార్గ చింత లేని వా(రెంత)!

చ. పర హింస పర భామాన్య ధన
పర మానవాపవాద
పర జీవనాదులకనృతమే
భాషించేరయ్య త్యాగరాజ నుత (ఎంత) !


పల్లవి ఒకటే చదివి "ఆహా ఏం చెప్పారు త్యాగరాజు గారు అనుకోవచ్చు . అనుపల్లవి కూడా చదవండి . "సిద్ధాంతమైన మార్గ చింతలేని" వారికి మాత్రమే ఇది applicable :)