చకోరి పాట, ఆ పాట వరుస ఏమిటో ఒక్క సారి విన్న వెంటనే మళ్ళీ వినాలనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంతగా వినాలన్న పాట రాలేదేమో లేక ఆ ట్యూన్ ప్రభావమో. మాములుగా రహమాన్ గారి పాటలు నిదానంగా అలవాటు అవుతాయి. ఈ పాట విన్నప్పడి నుండి వినాలనిపిస్తోంది . పాటలో పదాలు కూడా అలానే అమరాయి అనంత శ్రీరాం గారి దయ వలన. మధ్యలో కర్నాటక సంగీతం లో వచ్చే చిన్న వయోలిన్ బిట్ కూడా, చాలా బాగుంది అన్నీ కలిపి.
ఈ పాట లిరిక్స్: అనంత శ్రీరాం గారు
సంగీతం : రహమాన్ గారు, సినిమా: సాహసం శ్వాసగా సాగిపో
పదవే నీ రెక్కలు, నా రెక్కలు చాచి.
పోదాం ఈ దిక్కులు, ఆ చుక్కలు దాటి.
పరువంలో రాదారి ఆకాశం అయిందే .
పైపైకెళ్ళాలన్నదే, చకోరీ !!!!
పదరా ఆ చోటికి, ఈ చోటికంటానా
నీతో ఏ చోటికైనా వెంటనే రానా ..
చకోరీ ..... పందెములో .... పందెములో..
నే ముందరో , నువ్ ముందరో చూద్దాం ... చూద్దాం ...
మొదట ఆ మాటని మాటాడగలదెవరో
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో
తొలిగా మౌనాలని మోగించగలదెవరో
ముందు చెప్పెదెవరో , ముందుండేదెవరో
ఎదురుగ నిలిచి, ఎదలను తెరిచే
కాలం ఎప్పుడో , ఆ క్షణం ఇంకెప్పుడో ...
ఇట్టే పసిగట్టి , కను కదలిక బట్టీ కనిపెట్టి,
వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైనా
ఇన్నాళ్ళుగ దాగున్నది విరహం ,
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం,
అందాకీ పయనం సులువుగ మరి ముగిసేనా ....
తోడై నువు తీయించిన పరుగులు,
నీడై నువు అందించిన వెలుగులు ,
త్రోవై నువు చూపించే మలుపులు, మరిచేనా .....
బాగున్నది నీతో ఈ అనుభవం,
ఇంకా ఇది వందేళ్ళు అవసరం ,
నేనందుకు ఏం చేయలన్నది, మరి తెలిసేనా...
చకోరీ ..... పందెములో .... పందెములో..
!!!!!! :)
No comments:
Post a Comment