Tuesday, November 3, 2009

గండికోట

నాకు మధ్య కడప లో ఉన్న దర్శనీయ ప్రదేశాల గురించి అందరికీ తెలియచేయాలని అనిపించి, మొదటగా నాకు ఎంతో ఇష్టమైన గండికోట యొక్క చిత్రాలని ఇందులో పోస్ట్ చేస్తున్నాను. నేను ఒక రోజు గూగుల్ లో గండికోట అని వెదకటం ద్వారా లభించిన అద్భుతమైన చిత్రాలు ఇవి. వీటిని తిఇసిన్ వారు నిజంగా చాలా బాగా తీశారు. గండికోట గురించి మరింత సమాచారం కోసం వికీపీడియా లొ లింక్ కి ప్రయత్నించవచ్చు. http://te.wikipedia.org/wiki/గండికోట .

గండికోట గురించి ఇప్పటికే చాలా వెబ్ సైట్ లలో చాల సమాచారం ఉంది. కాని అవి చరిత్ర గురించి చెపుతూ ఉంటాయి. నేను ఎదో చిన్న ప్రయత్నం చేసి ఇలా ఫోటొ సమాచారం ఇక్కడ ఇస్తున్నాను.

గండికోట అనగానే నాకు గుర్తు వచ్చేది పెన్నా నది. చూడండి ఎంత అద్భుతంగా పెన్నా నదిని ఫొటోలలో బంధించారో ..


ఫొటో లని తీసిన వారు: కమల్


ఫొటో లని తీసిన వారు: అలేమారి@flickr


గండికోట లో మాధవరాయ స్వామి గుడి చాలా బాగుంటుంది. చూడండి ఫోటో లు మరి.
ఫొటో లని తీసిన వారు: కమల్




ఇంకా గండికోట లొ పెద్ద ధాన్యాగారము, జామా మసీదు కలవు. ఇవి రెండూ ప్రక్క ప్రక్కనే పెన్నా నది లోయ కి వెళ్ళే దారి లో ఉంటాయి.

ఫొటో లని తీసిన వారు :: rockbazz@flickr

ఫొటో లని తీసిన వారు :: gomare@flickr

ఇంకా గండికోట లో రఘునాథ స్వామి ఆలయం, చిన్న చిన్న నిర్మాణాలు, 40 అడుగుల కోట గోడ, దానికి కోట మొదటి భాగం లో పెద్ద ఇనుప దిమ్మలు, కలపతో చేయబడిన గంభీరమైన ముఖద్వారము, జామా మసీదు దగ్గర ఉండే కత్తుల కోనేరు, ఇంక చిన్న చిన్న కోనేరులు, గండికోట విజయ స్థంభము లు చూడదగినవి. ఇక్కడికి దగ్గరలో పెన్నా నది మీద మైలవరం, గండికోట రిజర్వాయర్ లు నిర్మించారు. మొత్తానికి గండికోట పిక్నిక్ స్పాట్ గా చాలా బాగుంటుంది.

గండికోట లో హోటల్ లాంటివి ఉండవు. మనమే ముందే కావాల్సినవి తయారు చేసుకుని వెళ్ళాలి. ఇది జమ్మలమడుగు నుండి 15కిమీ దూరంలో ఉంది.

ఫొటో లని తీసిన వారు :: gomare@ఫ్లికర్, కమల్



ఇదీ గండికోట గురించి. ఈ సారి మరిన్ని ఫోటో లు దొరికితే పోస్ట్ ని వాటితో అప్ డేట్ చేస్తాను.

--
purush